చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు అంగన్వాడి కేంద్రంలోని ఐసిడిఎస్ పిడి నాగమల్లేశ్వరి, హిందూపురం ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సిడిపిఓ రెడ్డి రమణమ్మ ఆదేశాల మేరకు అంగన్వాడి సూపర్వైజర్ సునీత బాయి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ అంగన్వాడీ సునీత బాయి మాట్లాడుతూబిడ్డ పుట్టిన నాటినుండి ఆరు నెలల వరకు తల్లిపాల శ్రేయస్కర మనీ ముఖ్యంగా బిడ్డికి మంచి పోషకాహారమని పేర్కొన్నారు.