హిందూపురం మున్సిపల్ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారంనిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిసెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్లు చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కార్మికులపై పని భారం పెరుగుతున్నదని కార్మికుల సంఖ్యను పెంచి వర్కర్లను నియమించాలని డిమాండ్ చేశారు.