హిందూపురం పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బి. కె పార్థసారధిని పట్టణ డిఎస్పి, సిఐ, ఎస్ఐలు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.