కదిరి అభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే కందికుంట

53చూసినవారు
కదిరి అభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే కందికుంట
కదిరి నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆయన కదిరి పట్టణం పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. తన మీద నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో కదిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్