జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేయాలి : ఏపీటీఎఫ్ నాయకులు

63చూసినవారు
జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేయాలి : ఏపీటీఎఫ్ నాయకులు
శెట్టూరు మండలంలోని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిలర్ కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన జీవో నెంబర్ 117ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఉద్యోగులకు రక్షణ లేని సిపిఎస్, జిపిఎస్ లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్