కళ్యాణదుర్గం: దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

70చూసినవారు
కళ్యాణదుర్గం: దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి బుధవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, బైక్స్, వీల్ చైర్స్ వంటివి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇంతవరకు అమలు చేయలేదన్నారు. వెంటనే హామీలను అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్