కదిరిదేవరపల్లి నుంచి గుంతకల్ మీదుగా తిరుపతికి వెళ్లే రైలును నవంబర్ 1వ తేది నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. రాయదుర్గం-కదిరిదేవరపల్లి మధ్య ఆధునికీకరణ పనులు చేస్తున్నందున నవంబర్ 30వ తేది వరకు రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ రైలు గుంతకల్, తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.