కంబదూరు మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులకు వర్షం నీరు చేరడంతో చెరువులు కళకళలాడుతుండడంతో రైతులు, గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కంబదూరు చెరువులో కూడా వర్షపు నీరు చేరడంతో చెరువులో నీటిమట్టం పెరిగింది. చెరువుల పక్కన ఉన్న వ్యవసాయ బోర్లలో నీటిమట్టం కూడా పెరుగుతుందని రైతులు తెలిపారు. వర్షం రావడంతో రైతులు, మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.