అమరాపురం మండలం, హేమావతి హెంజేరు సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారిని ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.