చిత్తూరుజిల్లా, కాణిపాకంలో కొలువుదీరిన వరసిద్ధి వినాయక స్వామిని మడకశిర నియోజకవర్గ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు ఎం. ఎస్. రాజు ఆదివారం దర్శించుకున్నారు. ఎం. ఎస్. రాజు కి స్థానిక పూతలపట్టు శాసనసభ్యులు కె. మురళీ మోహన్ స్వాగతం పలికి ఆలయంలోకి మర్యాదపూర్వకంగా వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కి ఆలయ ఈఓ, ప్రధాన అర్చకులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.