పెనుకొండ: హత్య కేసులో నిందితులు వివరాలు వెల్లడి

70చూసినవారు
పెనుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఇంఛార్జ్ డీఎస్పీ మహేష్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రొద్దం మండలం సానిపల్లి ఈత వనంలో ఈనెల 22న వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. శ్రీరంగరాజుపల్లికి చెందిన చాకలి రాజు, సుబ్బరాయుడు, మృతుని భార్యను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, కత్తి, 2 బైకులు స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరచామన్నారు.

సంబంధిత పోస్ట్