శ్రీసత్య సాయి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె పార్థసారథి అధ్యక్షతన జిల్లా స్థాయి అభివృద్ధిపై సమీక్ష (దిశ ) కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు గురించి చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతన్, మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, అధికారులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.