పుట్టపర్తి: 30 సంవత్సరాలైనా పరిష్కారం దొరకని రైతు సమస్య

58చూసినవారు
పుట్టపర్తి పొలంలో ఉన్న తన భూమికి పాసు బుక్కు మంజూరు చేయాలని రైతు చిమిరాల జగన్నాథ్ కలెక్టర్ చేతన్ కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. సర్వే నెంబర్లు 295-1, 296-3, 296-7 లలో 33 సెంట్ల భూమి ఉందన్నారు. దాన్ని సర్వే చేయించి పాసు బుక్కు మంజూరు చేయాలని 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానని కలెక్టర్ తో వాపోయారు. పూర్తి లింకు డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని, వాటిని చూసి తనకు న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్