ఓబులదేవర చెరువు ఐసిడిఎస్ ప్రాజెక్టులో చాలాఅవినీతి అక్రమాలు జరుగుతున్నాయని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి నాయకులతో కలసి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అక్రమాలపై పలు పత్రికలలో కథనాలుగా వచ్చినకూడా సిడిపిఓ, సూపర్వైజర్ల విధినిర్వహణలో ఏమాత్రంమార్పు రాలేదన్నారు.