ఏపీలోని పలు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, కాకినాడ, కోనసీమ, ప.గో, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.