క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాల విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. డిసెంబర్ 24 నుంచి 26 వరకు ప్రభుత్వం క్రిస్మస్ హాలిడేస్‌గా ప్రకటించింది. డిసెంబర్ 24న క్రిస్టమస్ ఈవ్, 25న క్రిస్టమస్, 26న బాక్సింగ్ డే (జనరల్ హాలిడే) కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలోని స్కూళ్లకు ఈ సెలవులు వర్తించనున్నాయి.