కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల యువతిపై తన స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు సదరు యువతి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. ఆమెను ఓ ఫంక్షన్‌కు ఆహ్వానించిన యువకుడు మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చాడు. పానీయం తాగిన తర్వాత బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో యువతిని ఒక గదికి తీసుకెళ్లి లైంగికంగా వేధించి ఆ చర్యను రికార్డ్ చేశాడని బాధిత యువతి పేర్కొంది.