పుట్టపర్తిలోని డీఆర్డిఏ కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో యానిమేటర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు వెంకటేష్, సాంబశివ యానిమేటర్లతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైకోర్ట్ ఆదేశాల ప్రకారం తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమను విధుల్లో నుంచి తొలగించి, బ్రతుకులు రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.