రాప్తాడు మండలంలో సోమవారం అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి బండమీదిపల్లి గ్రామంలో సల్లాపురమ్మ గుడి పూజారికి చెందిన 70 మేకలు మృతి చెందాయి. దింతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు భారీ నష్టం వాటిల్లిందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.