రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో బుధవారం ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటా లెప్రసీ సర్వే నిర్వహించారు. డాక్టర్ రవి నాయక్ పరిశీలనలో తెల్ల మచ్చలున్న వారిని పరీక్షించి, కుష్టు వ్యాధి అనుమానితులను ఆరోగ్య కేంద్రానికి పరీక్షలకు పంపించాల్సిందిగా సూచించారు. సర్వేలో ఆశ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.