కక్కలపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు

59చూసినవారు
కక్కలపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు
రాప్తాడు మండలం లోని కక్కలపల్లి మార్కెట్లో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన టమాటా ధరలు తగ్గాయి. ఆదివారం మొత్తం 18 మండీలకు 675 టన్నులు వచ్చాయి. కిలో గరిష్ఠంగా రూ. 52, మధ్యస్థం రూ. 40, కనిష్ఠం రూ. 30 చొప్పున ధరలు పలికాయి. 15 కిలోల బుట్ట ధర గరిష్ఠం రూ. 780, మధ్యస్థం రూ. 600, కనిష్ఠం రూ. 450 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ యార్డు ఇన్ఛార్జి రాంప్రసాద్ రావ్ ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్