రాయదుర్గం పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ మరియు 17వ వార్డులో మలేరియా, డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మలేరియా అధికారి నాగేంద్ర ప్రసాద్ అవగాహన కల్పించారు. శుక్రవారం హెల్త్ సెక్రటరీలు ప్రమీలమ్మ, శానిటేషన్ సెక్రటరీ ఓంకార్ సమక్షంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం ప్రతి ఇంట్లో డ్రైడే నిర్వహించుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.