తాడిపత్రిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం

73చూసినవారు
తాడిపత్రి లోని చింతల వెంకటరమణస్వామి చక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 8 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ కార్యక్రమంతో ముగిశాయి. చివరి రోజైన శనివారం ఆలయం వద్ద పుష్కరిణిలో చింతలరాయుడి చక్రస్నానం నిర్వహించారు. ముందుగా సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి పుష్కరిణి వద్దకు పల్లకీలో తీసుకొచ్చారు. మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం, పవిత్ర తులసి దళాలతో పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్