రక్తదాన శిబిరానికి విశేష స్పందన

82చూసినవారు
రక్తదాన శిబిరానికి విశేష స్పందన
యాడికి మండలంలో జాతీయ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా ప్రజలు దాదాపు 88 యూనిట్ల రక్తాన్ని ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సేకరించిన రక్తాన్ని అనంతరం గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుకు అందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్