ఉరవకొండ మండలం పెన్నహోబిళం గ్రామంలో రామకృష్ణ అనే రైతు పొలంలో శనివారం వేరుశనగ పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తనిఖీ అధికారిగా మండల వ్యవసాయ అధికారి శుభకర్ హాజరయ్యారు. 5×5 విస్తీర్ణంలో 1. 650 కేజీల దిగిబడి వచ్చిందని, దీని ప్రకారం ఎకరాకు 165 కేజీలు వచ్చినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.