ఎమ్మిగనూరు: విద్యార్థి ప్రాణాలు కాపాడిన ఎస్సై
ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని ఎమ్మిగనూరు స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల్ రాజు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. బుధవారం ఎమ్మిగనూరు మండలం కడివెళ్లకు చెందిన రాముడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ఎద్దుల మార్కెట్ నుంచి హైకొండకు వెళ్లే దారిలో పురుగుమందు తాగుతూ సెల్ఫీ వీడియో షేర్ చేశాడు. సైబర్ ల్యాబ్ పోలీసుల సహాయంతో రాముడు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని కాపాడారు.