ఎమ్మిగనూరులో కుక్కల బెడద
ఎమ్మిగనూరు పట్టణంలోని వీధుల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శివారు ప్రాంతమైన ఎన్టీఆర్ కాలనీ, శివన్న నగర్, సొగనూర్ రోడ్ లలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కుక్కలు గుంపులుగా ఉన్నప్పుడు ఒంటరి మహిళలు, చిన్నారులపై, వాహనదారులపై దాడులు చేస్తున్నాయి. కుక్కల నివారణకు మునిసిపల్ అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.