సోమవారం ఆముదాలవలసలో 42 రోజులు దీక్షలు చేసిన అయ్యప్పలు శబరిమలకు బయలుదేరారు. అయ్యప్పలు వారు వీధిలో ఉన్న అయ్యప్ప కోవెల్లో వద్ద గురు స్వామి రమణయ్య ఆధ్వర్యంలో ఇరుముడ్లు కట్టారు. అయ్యప్ప స్వాములు కష్టాలు ఓర్చుకొని దీక్షలు చేపట్టి 42 రోజులు పాటు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లో శబరిమల వెళ్ళు బండి కోసం పరిసర ప్రాంతాల నుండి అయ్యప్ప స్వాములు తరలివస్తున్నారు.