డిసెంబర్ 17న పెన్షనర్స్ డే ను విజయవంతం చేయాలని పెన్షనర్స్ యూనియన్ నాయకులు బి జనార్దన్ రావు హనుమంతు వెంకట సత్యనారాయణ కోరారు. ఆదివారం ఆముదాలవలసలో పెన్షన్ సమావేశం నిర్వహించారు. పట్టణంలో డిసెంబర్ 17న ఉదయం పెన్షనర్స్ ర్యాలీ ఉంటుందని, వెంకటేశ్వర కళ్యాణ మండపంలో పెన్షనర్స్ సమావేశం జరుగునని తెలిపారు. పెన్షనర్స్ విధిగా హాజరు కావాలని సంఘ నాయకులు కోరారు.