ఆముదాలవలస: ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులు ముఖ్యం కాదు

66చూసినవారు
ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజనవిభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఆముదాలవలసలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నాలుగు నెలల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదవి వస్తేనే పవర్ ఉంటుందని, పదవి రాకపోతే పవర్ ఉండదనే భావన సరైనది కాదని అన్నారు. సమావేశంలో పి. చిన్నారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్