యువత సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆముదాలవలస ఎస్సై కే. వెంకటేష్ అన్నారు. గురువారం ఆముదాలవలస పట్టణంలోని వెంకటేశ్వర ఐటిఐ విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, అనుమతులు లేకుండా వాహనాలు నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.