గంజాయి కేసులో ముగ్గురు నిందితులను రేగిడి ఆమదాలవలస పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని బాలకవివలస వద్ద లేఅవుట్లో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్నట్లు ముగ్గురు నిందితులను గుర్తించారు. వారు పాలకొండకు చెందిన దుర్గాప్రసాద్ నుంచి గంజాయిని కొనుక్కున్నట్లు పోలీసులకు తెలిపారు. క్రయవిక్రయాలు చేసిన వారిని అరెస్టు చేశామని రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తెలిపారు.