గతంలో సిఐ కి దూషించిన కేసులో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ మొదటి ముద్దాయి వదిలి పెట్టి రెండో ముద్దాయినైన తనను పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని 2024 అసెంబ్లీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సలపల సురేష్ ఆరోపించారు. ఆముదలవలసలోనే తన నివాసంలో సురేష్ ను పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి వచ్చి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అని అన్నారు.