రణస్థలం: అనారోగ్యంతో విజయనగరంలో హాస్టల్ విద్యార్థి మృతి

77చూసినవారు
రణస్థలం: అనారోగ్యంతో విజయనగరంలో హాస్టల్ విద్యార్థి మృతి
విజయనగరంలోని కాటవీధి బీసీ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థి కొణతాల శ్యామలరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. రణస్థలం మండలం చిల్లపేటరాజం గ్రామానికి చెందిన శ్యామల రావు ఉదయం కళ్ళు తిరుగుతున్నాయని పడిపోవడంతో హాస్టల్ వార్డెన్ జానకిరామ్ విజయనగరం జిల్లా సర్వజన అస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు తనిఖీ చేసి విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్