ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న లారీ

65చూసినవారు
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న లారీ
కంచిలి మండలంలోని జాడుపూడి కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టి సుమారు 50 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కవిటి మండలంలోని శవసానపుట్టుగ గ్రామానికి చెందిన మట్ట గిరి, నర్తు దుర్యోధన గాయపడ్డారు. స్థానికులు వారిని ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్