సోంపేట మండల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ఆధార్ క్యాంప్ లు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బి. వెంకటరమణ సోమవారం తెలిపారు. చిన్న వయసులో ఆధార్ పొంది 18 ఏళ్లు నిండిన తర్వాత వేలిముద్ర నమోదు చేసుకోవాలని, అలాగే పదేళ్లలో ఒకసారైనా ఆధార్ అప్డేట్ చేయనివారు తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు.