కవిటి: రాజకీయల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదు: ఎమ్మెల్యే

57చూసినవారు
రాజకీయాల్లోకి తాను ఎప్పుడు వస్తానని ఊహించలేదని ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు అన్నారు. ఆదివారం కవిటి మండల కేంద్రంలో అగ్నికుల క్షత్రియ ఆత్మీయ సమావేశంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి అశోక్ ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందని వివరించారు. ఈ క్రమంలో పేదలకు సేవ చేయాలన్న ఆశయంతోనే నేడు కృషి చేస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్