కూటమి ప్రభుత్వం హయాంలో పల్లెలలో రహదారుల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. ఆదివారం సోంపేట మండలం పోత్ర కొండ గ్రామంలో రహదారి పనులకు గాను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తన హయాంలో గ్రామాలలో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.