నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దాడ లత మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక ఎన్సిసి విద్యార్థులు చేపట్టిన పెరిడ్ స్థానికులను ఆకట్టుకుంది. అనంతరం జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.