జలుమూరు మండలం శ్రీముఖలింగంలో కొలువై ఉన్న శ్రీముఖలింగేశ్వర ఆలయంలో కేశఖండనకు సంబంధించి సరైన మౌలిక వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం వందల మంది శివ స్వాములు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో కేశఖండన కేంద్రంలో ఎటువంటి వసతులు లేకపోవడంతో వర్షంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురయింది. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.