నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు పాగోటి అప్పలస్వామి (80) మంగళవారం అకస్మాత్తుగా మృతిచెందారు. ఈయన కంబకాయ గ్రామ ఉప సర్పంచిగా, రేషన్ డీలరుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి, మాజీ సర్పంచి ఉమామహేశ్వరి, పలువురు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.