పలాస కాశీబుగ్గ ఉద్దాన ప్రాంత విద్యాభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన అక్కుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభా పరీక్ష, విద్యా సదస్సు జరుగుతుందని వేదిక ప్రధాన కార్యదర్శి గొరకల లోకేశ్వరరావు వారి టీచర్స్ బృందం శనివారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని, అసక్తి ఉన్నవారు 99637 08029 నంబర్ కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.