పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని వసప గ్రామంలో మొదటి సీఎం సహాయ నిధి చెక్కును పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వలురౌతు తిరుపతిరావు కి శనివారం అందించారు. అనంతరం ఈ సహాయ నిధి డబ్బులు వైద్య ఖర్చుల కోసం తిరుపతిరావుకి ఎంతగానో ఉపయోగపడతాయని మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండలంలోని నాయకులు పాల్గొన్నారు.