కొత్తూరు మండలం వసప గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. శనివారం పింఛను పంపిణీ అనంతరం వసప గ్రామ ప్రజల సమస్యలను అడిగిమరీ తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు బైరాగి నాయుడు, మాజీ సర్పంచ్ వలురౌతు వెంకటరావు, వలురౌతు సుధాకర రావు,తదితర మండల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.