హిరమండలంలోని ప్రేమ సాయి వృద్ధాశ్రమం యందు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు మంగళవారం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం సీనియర్ బిజెపి నాయకులు సిరిపురం. తేజశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆశ్రమంలో బిజెపి నాయకులు తేజేశ్వరరావు కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించారు. అలాగే పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు.