సంక్రాతికి పండగకు గ్రామాలను విడిచి పట్టణాల్లో ఉన్న అనేకమంది సొంత గ్రామాల్లో పండగ చేసుకోడానికి వచ్చారు. ఆనందంతో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో భోగి, సంక్రాంతి, కనుమ పండగను నిర్వహించుకుని.. పండగ పూర్తి కావడంతో భారమైన హృదయంతో సొంతూళ్లకు విడిచి తిరుగు ప్రయాణమవుతున్నారు. వారితో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.