కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక, డైరీ డవలప్‌మెంట్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం అన్నారు. శ్రీకాకుళం నగరంలోని మంత్రి అచ్చెన్నాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు కడుపునిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.