కోటబొమ్మాళి మండలం తాటిపర్తి పంచాయతీలో 20 మంది అర్హత కలిగిన పింఛన్ లబ్ధిదారులను తొలగిస్తూ వారి పింఛన్లను నిలిపివేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే పింఛన్లు నిలిపేశారని దుయ్యబట్టారు.