భార్యాభర్తలు బంధం కలకాలం నిలబడాలని చిన్న చిన్న విభేదాలకు విడిపోకూడదని కోటబొమ్మాలి జూనియర్ సివిల్ జడ్జి బి. ఎం. ఆర్. ప్రసన్నలత అన్నారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని కోర్టులో శుక్రవారం వరకట్న వేధింపుల కేసులో భార్యా భర్తలకు కౌన్సెలింగ్ చేసి ఆ జంటలను పూలదండలతో మళ్లీ కలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, ఏపీపీ హరిప్రియ, ఏజిపి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.