ఆయకట్టు రైతులను ఆదుకోవాలి

58చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో గెలిచిన కూటమి నాయకులు, కాబోయే మంత్రులు ఆయకట్టు రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ ఓనిగెడ్డ, ఓపెన్ హెడ్ చానల్స్ ఆయకట్టు స్థిరీకరణచేసి నారాయణపురం ఆనకట్ట పరిధిలో సాగునీరు అందించాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు.

సంబంధిత పోస్ట్